ఎన్టిపీసి1వ. డివిజన్ కార్పొరేటర్ మడిపల్లి మల్లేష్ విజయ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లును మొగ్గుపోసి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//ఎన్టిపీసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఇందిరమ్మ ఇల్లు పథకం” ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడం జరుగుతోంది. ఈ పథకం కింద నిర్మించబడిన ఎన్టిపీసి 1వ.డివిజన్ మేడిపల్లి విలెజ్ ని నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, వారితో పాటు మేయర్ మహంకాళి స్వామి హాజరై, నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ…“ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను నిజం చేయడం రాష్ట్ర ప్రభుత్వ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లక్ష్యం. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎంతో మంది నిరాశ్రయులకు స్థిర నివాసం లభిస్తోంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని” తెలిపారు.
లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, స్థానిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు ప్రజలు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY