గోపాల్‌పూర్ క్రాస్ రోడ్ వద్ద ‘SS లుడ్వినా-లువినా’ బేకరీ ప్రారంభం…
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని..
హనుమకొండ,
హనుమకొండ నగరం గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వస్కుల శైలజ – శ్రీధర్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన “SS LUDHVINA -LUVINA ” (SS లుథ్వినా-లువినా) కేక్స్ అండ్ బేకరీని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ముందుగా బేకరీ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శాసనసభ్యులు కి నిర్వాహక కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించి తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బేకరీ నిర్వాహకుల కుటుంబ సభ్యులు మరియు మిత్రులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
