బిఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ బాగుండేది : కేటీఆర్ కి తమ సమస్యలను వివరించిన కొంపల్లి శ్వేతశుభం రెసిడెన్స్ వాసులు…
సాక్షిత : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ఆధ్వర్యంలో నంది నగర్ లోని వారి నివాసంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన కొంపల్లి సర్కిల్ శ్వేతా శుభం రెసిడెన్సి ఐటీ ఉద్యోగులు కాంగ్రెస్ పాలనలో వారు పడుతున్న అవస్థలను కేటీఆర్ కి వివరించారు.
ఈ సందర్భంగా శ్వేతా శుభం రెసిడెన్స్ వాసులు, ఐటీ ఉద్యోగులు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు విడిచి రోజు త్రాగునీటి సరఫరాతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవారిమని, ఇప్పుడు నాలుగు, ఐదు రోజులకు ఒకసారి లో ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతుందని తద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అదేవిధంగా కాలనీలో బోయిన్పల్లి నుంచి సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ పనులు గత సంవత్సరన్నర కాలంగా పూర్తిగా నిలిచిపోయాయని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అసెంబ్లీతోపాటు పలు వేదికలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు చేపడతామన్న మెట్రో పనులు ఆరంభం కాకపోవడంతో హైదరాబాద్ రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందితో తీవ్ర అవస్థలు పడుతున్నామని విన్నవించారు.
కొంపల్లి శ్వేతా శుభం రెసిడెన్స్ వాసుల సమస్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ…. మన బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో మౌనిక వసతులను అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ నగరానికి పెట్టుబడులను తీసుకువస్తూ ఎంతో అభివృద్ధి పరిచామని, కానీ నేటి ఈ ప్రభుత్వంలో మౌలిక వసతులను నిర్వహణ చేయలేని అద్వాన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. శ్వేతా శుభం రెసిడెన్స్ వాసుల సమస్యల గురించి ప్రభుత్వంపై పోరాటం చేసైనా నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులను, త్రాగునీటి సరఫరా సమస్యతో పాటు మెట్రోను సాధిస్తామని హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
