నిబంధనల పేరిట రైతుల్ని నష్ఠపరిస్తే ఎలా? : ప్రత్తిపాటి
సీసీఐ నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. తేమశాతం..గుడ్డికాయ పేరిట రైతుల కష్టాన్ని గుర్తించకపోవడం విచారకరం.
రైతులు సమస్యల్ని కలెక్టర్ తో చర్చిస్తే.. వారుకూడా నాణ్యత తక్కువున్న పత్తికి తగిన ధర చెల్లించాలని కోరగా..నిబంధనలు అంగీకరించవంటున్నారు.
నిబంధనలు సడలించైనా పత్తి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడతాం.
సమస్య తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడితో చర్చించి రైతులకు న్యాయం జరేగేలా చూస్తాను.
సీసీఐ కొనుగోలు కేంద్రాన్నితనిఖీ చేసి, రైతులతో మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
నాదెండ్ల : సీసీఐ కొనుగోళ్లపై పత్తి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎంతో కష్టపడి పత్తిని తీసుకొస్తే నిబంధనల పేరిట వెనక్క పంపడం న్యాయం కాదని, నాణ్యత తక్కువ ఉన్న పత్తికి కూగా తగిన ధర నిర్ణయించి కొనుగోలు జరిపి రైతులకు న్యాయం చేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు సూచించారు.
నాదెండ్ల మండలం గణపవరంలోని వెంకటకృష్ణ ఎంటర్ ప్రైజెస్ లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రత్తిపాటి తనిఖీచేశారు. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న ప్రత్తిపాటి.. అనంతరం సీసీఐ, వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, పట్టువిడుపులతో వ్యవహరించి వారిని ఆదుకోవాలని ప్ర్తతిపాటి సీసీఐ అధికారుల్ని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తిని వెనక్కు తీసుకెళ్లడం ఎంత కష్టమో ఆలోచించాలి
మొంథా తుపాన్ వల్ల, అధికవర్షాల వల్ల పత్తి నాణ్యతలో 5 శాతం తేడా వచ్చిందని, దాంతో గుడ్డికాయ ఎక్కువగా ఉన్నపత్తిని తీసేసి, మంచి పత్తికి తగిన ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, కానీ సీసీఐ ఆదేశాలు అలా లేవని అధికారులు చెబుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. దూరాభారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తిని మరలా వెనక్కు తీసుకెళ్లాలంటే ఏ రైతుకైనా ఇబ్బందేనన్న ప్రత్తిపాటి.. ధర తగ్గించి,.. నాణ్యతలేని సరుకును మినహాయించి అయినా రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ప్రత్తిపాటి చెప్పారు. ఇదే అంశాన్ని ఇక్కడున్న బయ్యర్లతో మాట్లాడితే, వారు తాము అలా సీసీఐ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు చేపట్టలేమని చెప్పినట్టు ప్రత్తిపాటి పేర్కొన్నారు.
జీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ చెప్పారు
సమస్య్త తీవ్రత.. రైతాంగం ఇబ్బందుల దృష్ట్యా వెంటనే కలెక్టర్ తో మాట్లాడగా, వారు కూడా గుడ్డికాయ ఉన్న పత్తిని మినహాయించి మిగిలిన దాన్ని మంచి ధరకు తీసుకోవాలని బయ్యర్లకు సూచించారని ప్రత్తిపాటి చెప్పారు. స్లాట్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరినట్టు ప్రత్తిపాటి చెప్పారు. రైతుల కష్టాలు, తన సూచనలపై సీసీఐ జీఎంతో మాట్లాడతానని, నిబంధనలు సడలిచేంలా చూస్తానని కలెక్టర్ తెలిపినట్టు ప్రత్తిపాటి చెప్పారు. కొనుగోళ్లు 5 రోజులు జరిగేలా చేడతామని ఈ సందర్భంగా సీసీఐ అధికారులు ప్రత్తిపాటికి చెప్పారు.
పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళతాను
ఎంత పత్తిని కొనుగోలు చేసినా రైతు కష్టం.. నష్టం భరించలేనిది..ఎవరూ పూడ్చలేనిదన్న ప్రత్తిపాటి.. స్లాట్ రిజర్వేషన్ పరిమితిని పెంచాలని అధికారులకు సూచించామన్నారు.30 శాతం కొనుగోళ్ల పరిమితి పెంచితే 1200 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయవచ్చన్నారు. ఒక క్వింటాల్ కు ఎంత గుడ్డికాయ ఉంటుం దో లెక్కించి, దానికి అనుణంగా కొనుగోళ్లు చేపట్టేలా చూడాలని సీసీఐ అధికారుల్ని, బయ్యర్లను కోరడం జరిగిందన్నారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకెళ్లి,, సీసీఐ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి.. రైతుల సమస్యలకు పరిష్కారం లభించేలా చూస్తామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. స్లాట్ రిజర్వేషన్ ను రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జిల్లాలవారీగా అమలు చేసేలా ప్రభుత్వంతో మాట్లాడతామని ప్రత్తిపాటి తెలిపారు.
ప్రస్తుతం మూడు రోజులు మాత్రమే కొనసాగుతున్న కొనుగోళ్లను 5 రోజులకు పెంచాలి గతంలోనే కలెక్టర్ కు సూచించామని, దానిపై సీసీఐ అధికారులు అంగీకరించినట్టు ప్ర్తత్తిపాటి చెప్పారు. స్లాట్ రిజర్వేషన్ రైతులకు అనుకూలంగా ఉంటేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఏదిఏమైనా బయ్యర్లు కాస్త పారదర్శకంగా వ్యవహరిస్తేనే రైతుల సమస్య పరిష్కారమవుతుందన్నారు. పత్తిని బూరాల్లో కాకుండా లూజ్ గా తీసుకు రమ్మని బయ్యర్లు కండిషన్ పెట్టారని దాన్ని కూడా తొలగించాలని ప్రత్తిపాటి ఆదేశించారు. చిలకలూరిపేట పరిధిలో 5 సీసీఐ కొనుగోలు కేంద్రాలుండగా, ఒక్కో కేంద్రంలో 1200 క్వింటాళ్ల చొప్పున రోజుకు 6 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. , కానీ కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 40వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఏది ఏమైనా రైతాంగం సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెడితేనే, సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు..
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీచేసిన ప్రత్తిపాటి వెంట జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, సొసైటీ చైర్మన్ నల్లమోతు హరిబాబు, రైతు అధ్యక్షులు అంబటి సోంబాబు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, సిసిఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

