అనధికారిక నిర్మాణాల అడ్డగింత
** తిరుపతిలో మున్సిపల్ ప్లానింగ్ సిబ్బంది చాతుర్యం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరపాలక సంస్థ పరిధిలోని మధురానగర్ లో అనధికారికంగా జరుగుతున్న అదనపు నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. మధురా నగర్ 17వ సచివాలయం పరిధిలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశాల మేరకు పరశీలించామని డిసిపి ఖాన్ తెలిపారు. అక్కడ జరుగుతున్న అదనపు నిర్మాణలకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సెంట్రింగ్ వర్క్ తొలగించి నిర్మాణాలను అడ్డుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మూర్తి, టిఫిఓ వంశీ, టిఫిబిఓ సంతోష్, ప్లానింగ్ సెక్రటరీ లు అక్బర్, మునీంద్ర, పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
