నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఆదర్శంగా నిలిచారు

Sakshitha news

నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఆదర్శంగా నిలిచారు
నాయకులు నందిమల్ల తిరుమలయ్య………మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

సాక్షిత వనపర్తి
నందిమల్ల.తిరుమలయ్య(మాజీ సింగిల్ విండో అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్) ఏకా దశదిన ఖర్మ సందర్భంగా ఆయన కుమారుడు నందిమల్ల.అశోక్ స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
తిరుమలయ్య ఆదర్శ రాజకీయ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారని నేటి నాయకులకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.
ప్రజా జీవితములో తిరుమలయ్య లేని లోటు తీర్చలేనిది అని అన్నారు.
కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ శారదా అశోక్ ప్రజాసేవలో తిరుమలయ్య ఆశయాలను కొనసాగించాలని కోరారు.
నిరంజన్ రెడ్డి వెంట బి.లక్ష్మయ్య,ఉంగ్లం.తిరుమల్,వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి,బొబ్బిలి.ప్రేమ్ కుమార్,స్టార్.రహీమ్,నందిమల్ల.రాములు,రామకృష్ణ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Scroll to Top