స్విమ్స్ రేడియాలజి విభాగంలో గెస్ట్ లెక్చర్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) రేడియాలజి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం మహిళా వైద్యకళాశాల లెక్చరర్ గ్యాలరీ-1లో గెస్ట్ లెక్చర్ సదస్సు జరిగింది. కార్డియాక్ ఎంఆర్ఐ బేసిక్స్ అండ్ గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ హెడ్ అండ్ నెక్ కాన్సర్స్ అనే అంశాలపై అతిథి ఉపన్యాసం నిర్వహించినట్లు మెడికల్ సూపరిటెండెంట్ డా.రామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డా.అలోక్ సచన్, రిజిస్ట్రార్ డా.అపర్ణ ఆర్ బిట్లా, రేడియాలజి విభాగాధిపతి డా.విజయలక్ష్మి, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఉషా కళావత్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ రేడియాలజీ ప్రొఫెసర్ డా.శిల్పా కడియాల, డా.అశ్విని కుమార్, డా.ప్రీతిబాల వత్సవ పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
కన్సల్టెంట్ రేడియాలజిస్టు, క్లినికల్ లీడ్, జార్జ్ ఎలిలాట్ హాస్పిటల్, నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్టు యుకె నుండి విచ్చేసిన డా. అశ్వినికుమార్ కార్డియక్ ఎంఆర్‌ఐ బెసిక్స్ అనే అంశంపై వివరిస్తూ… గుండె నిర్మాణాన్ని, పనితీరును, వ్యాధులను వివరంగ తెలసుకోవడానికి మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమెజింగ్‌ను ఉపయోగిస్తారని తెలిపారు. ముఖ్యంగా గుండె కండరాల వైఫల్యం (కార్డియో మయోపతి), ఇస్కీమిక్ గుండె జబ్బులు (గుండె పోటు తర్వాత) గుర్తించడంలో ప్రాధాన్యత ఉంటుందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డా. ప్రీతిబాల వత్సవ గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ హెడ్ అండ్ నెక్ కాన్సర్స్ అనే అంశంపై ఉపన్యసించారు. తల, మెడ క్యాన్సర్ ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంటుందని… దీనికి పొగాకు, హెచ్‌పివి వంటి ప్రధాన కారణాలని, ఇవి పురుషులలో 5వ స్థానంలో మహిళలల్లో 12వ స్థానంలో నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఇవి ప్రధానంగా నోట్లో నయం కాని పుండ్లు, మెడలో గడ్డలు, నిరంతరం దగ్గు, గొంతులో మార్పులు చెవినొప్పి వంటి లక్షణాలుంటాయని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మెరుగైనచికిత్స పొందాలని తెలిపారు. స్విమ్స్ రేడియాలజీ విభాగాధిపతి డా.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ క్యాక్రమానికి అనుమతినిచ్చిన స్విమ్స్ సంచాలకులు డా. ఆర్.వి.కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అతిథులుగా విచ్చేసిన డా. అశ్వినికుమార్, డా. ప్రీతిబాల వత్సవలను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో నూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డా.టీసీ కళావత్, ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, రేడియాలజీ డాక్టర్స్ డా. సరళ, డా.పవన్, డా.అమిత విక్రమ, పి.జి.డాక్టర్లు, వివిధ వైద్య విభాగాధిపతులు, పి.జి వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

