ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరానికి విశేష స్పందన.. 46 మంది శస్త్రచికిత్సకు ఎంపిక….
సాయి సేవా సమితిలో సేవా కార్యక్రమం 109 మందికి కంటి పరీక్షలు….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, :
గోదావరిఖని స్పూర్తి సేవా సంఘం ఆధ్వర్యంలో, రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఎన్‌టీపీసీ సాయి సేవా సమితిలో ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్స ఎంపిక శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరానికి మొత్తం 109 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం 46 మందిని శస్త్రచికిత్స కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి ప్రత్యేక బస్సులో తరలించారు. వారికి ఈరోజు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, శుక్రవారం శస్త్రచికిత్స చేసి అనంతరం తిరిగి తీసుకువస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్ల ప్రసాద్ హాజరుకాగా, విశిష్ట అతిథులుగా కొమురవెల్లి సుధాకర్, మామిడిపల్లి శ్రీధర్, గోపాలరావు, గుంత వినోద్, షేగంటి నరేష్, రమణారావు, రంగారావు, అశోక్‌రావు, చింతల సతీష్, మహేందర్‌రెడ్డి, కొమురవెల్లి రాహుల్, అనిల్‌రావు, సాయి సేవా సమితి నిర్వాహకులు అశోక్‌రెడ్డి, వేణు, నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
