ఘనంగా కిరణ్య–అనన్యల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

Sakshitha news

ఘనంగా కిరణ్య–అనన్యల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామానికి చెందిన రెండవ వార్డ్ మెంబర్ చేతురాజుపల్లి వీరేష్–సరిత దంపతుల కుమార్తెలు కిరణ్య, అనన్యల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం బుధవారం అత్యంత ఘనంగా, సంప్రదాయ వైభవంతో నిర్వహించారు. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథులుగా టేకుమట్ల గ్రామ మాజీ సర్పంచ్, సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పు శ్రీనివాస్ నాయుడు, మాజీ సర్పంచ్ పిండిగ పద్మ నాగేందర్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ఇలాంటి కుటుంబీయ, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను, ప్రేమానురాగాలను మరింత బలపరుస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టు వస్త్రాలతో అలంకరించిన కిరణ్య–అనన్యలు అందరి మనసులను ఆకట్టుకునే విధంగా మెరిశారు. తల్లిదండ్రులు వీరేష్–సరిత దంపతులు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఆనందోత్సాహాల నడుమ ఈ వేడుక జరగడంతో టేకుమట్ల గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

Scroll to Top