పేదల కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుంది….
సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. 4వ. డివిజన్‌కు చెందిన సమినా బేగంకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.22 వేల చెక్కును ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో 4వ. డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
