జగ్జీవన్ రాం కి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ..
సాక్షిత పెద్దపల్లి//. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం రోజున జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో.. నిర్వహిస్తున్న భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం 119వ. జయంతిని పురస్కరించుకొని, వారి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .
అనంతరం వారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY