అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్,

Sakshitha news

అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

సాక్షిత :దసరా నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. గత ఐదేళ్లు రాష్టం విధ్వంసానికి గురైందని, కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అభిలషించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేకు దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
( విజయవాడ ఇంద్రకీలాద్రి మీడియా కేంద్రం నుంచి జారీ)