కొడకండ్ల మండలం జీబీ తండ గ్రామానికి చెందిన గూగులోత్ కౌసల్య అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, వారు వెంటనే స్పందించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు..
ఈ సందర్భంగా గూగులోత్ కౌసల్య వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం ద్వారా రూ.3 లక్షల విలువైన ఎల్ఓసి ని మంజూరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వయంగా అధికారులతో మాట్లాడి చికిత్స ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు..
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమం విషయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎల్లప్పుడూ ముందుండి సహకరిస్తున్నారని గ్రామస్తులు అభినందించారు..
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చేరవేసేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
