అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమివ్వండి
15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్
చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి
శంకర్‌పల్లి: సాక్షిత : శంకర్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా తన సతీమణి సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ తన పదవికాలంలో చేసిన అభివృద్ధిని చూసి మరో అవకాశమివ్వండని 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు పెద్దలతో కలిసి 15వ వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. చైర్ పర్సన్ గా ఉన్న కాలంలో శంకర్‌పల్లిలో ఎన్నో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో 15వ వార్డును మున్సిపాలిటీలోని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యతను బాధ్యాతయుతంగా నిర్వర్తిస్తానని హామీ ఇస్తున్నన్నారు.
ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, వార్డులోని ప్రతి సమస్యను బాధ్యాతయుతంగా పరి ష్కారిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాన్నన్నారు. ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో ప్రతి వార్డును అభివృద్ధిలో ముందుంచుతానని తెలిపారు. చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆ వార్డుల పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

