గాజులరామారం సర్కిల్ ఉప కమిషనర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి సర్కిల్ అధికారులకు మరియు ఉద్యోగులకు తగు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారము కార్యక్రమాలు నిర్వహించి హెడ్ ఆఫీస్ వారు నిర్దేశించిన ఫార్మాట్లలో రిపోర్టులు సబ్మిట్ చేయాలని ఆదేశించడం జరిగింది.
గాజులరామారం సర్కిల్ పరిధిలోని ఇతర గవర్నమెంట్ బిల్డింగ్లైన స్కూళ్లు, పోలీస్ స్టేషన్ , ఎం.ఆర్.ఓ. ఆఫీస్, బస్తీ దవాఖానా వంటివి శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీపాద రామేశ్వర్ , శానిటేషన్ అధికారులు మరియు సిబ్బంది ,కాలనీ వాసులు మరియు యు సి డి ఆర్ పి లు పాల్గొన్నారు.
అదే విధంగా సర్కిల్ పరిధిలో చాలా రోజులుగా ఉపయోగించకుండా వదిలేసి ఉంచిన వాహనాలకు స్టిక్కరింగ్ చేయడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY