గాజులరామారం సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాక సమావేశంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్…..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ని గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజులరామారం, మహాదేవపురం, షాపూర్ నగర్, మరియు సురారం డివిజన్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది…
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలో ముఖ్యమైన రేషన్ కార్డులు, మరియు పేదలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, మరియు ఇందిరమ్మ ఇండ్లు ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు…
అదేవిధంగా రాబోవు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని డివిజన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు బలంగా పనిచేసే వారికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందని నాయకులను ఉద్దేశించి మాట్లాడారు..
ఈ కార్యక్రమంలో *మేడ్చల్ డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ * తో పాటు గాజులరామారం సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు….

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY