మైనారిటీల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచి, వారి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే నేత ప్రత్తిపాటి పుల్లారావు – తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేతలు
ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి జీవన ప్రమాణాలను గత రెండు దశాబ్దాలుగా మెరుగుపరచి వారికి రాజకీయ గుర్తింపును నియోజకవర్గ వ్యాప్తంగా తెచ్చిన మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి వంటి నాయకునిపై అవాకులు, చావాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదాను తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు హెచ్చరించారు. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జాన్ సైదా అనే కాంట్రాక్టర్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలకు సరఫరా చేసిన వస్తువులకు సంబంధించిన కాంట్రాక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పాడటం జరిగిందని, దానిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తే, సదరు అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నిన్న జాన్ సైదా చేసిన ప్రెస్ మీట్ కు సంబంధించిన పలు అంశాలపై నేతలు స్పందించడం జరిగింది. ఈ రోజు పేట పట్టణంలో ట్రాన్స్ పోర్ట్, మెకానికల్, ఆటోమొబైల్స్, ఓల్డ్ బారన్, రియల్ ఎస్టేట్, ఫ్రూట్స్, గ్రావెల్ సరఫరా వంటి రంగాలలో ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు ఉన్నత స్థానాలలో ఉన్న సంగతి బహుశా ఈ జాన్ సైదా కు తెలియకపోవచ్చునని, పేట నియిజకవర్గంలో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని, గత 26 సంవత్సరాలుగా ఏ ఒక్క వ్యాపారీ ప్రత్తిపాటి పుల్లారావు గారి వల్ల ఇబ్బంది పడిన సందర్భం లేదని, నీకు దమ్ము ఉంటే ఒక్క వ్యాపారి చేత ఈ పాతికేళ్లలో ఏం ఇబ్బంది పడ్డారో చెప్పించాలని నేతలు సవాల్ విసిరారు. పేటవైస్సార్సీపీ సీటును ఆశించి, కేవలం గుర్తింపు కోసం నాడు జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను పెట్టి, 4మసీదులకు, 2చర్చీలకు చందాలు ఇచ్చి, ఎదో పేట నియోజకవర్గాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్లు మాట్లాడితే, ప్రజలు పిచ్చివాళ్ళు కారని నేతలు తెలిపారు. మరి 2024 పేట సీటును ప్రకటించిన నాటి నుండీ నీ సేవా కార్యక్రమాలు ఎటు పోయాయాని నేతలు ప్రశ్నించారు. సంవత్సర కాలంగా నా సంస్థ పై అసెంబ్లీ లో ప్రత్తిపాటి మాట్లాడుతున్నారని చెబుతున్నావు, మరి వందల కోట్ల ప్రజా ధనాన్ని కొందరు ఉన్నత అధికారులను అడ్డం పెట్టుకుని నువ్వు బినామీగా ఉండి దోచుకుంటే, బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసి, నీ అవినీతి పై ప్రశ్నించడం తప్పు అనే హక్కు నీకు ఎక్కడ ఉంది అని నేతలు ప్రశ్నించారు.నువ్వు ఆర్ధికంగా ఎదిగితే ఎవడికి నష్టం అని నేతలు సూటిగా ప్రశ్నించారు. ప్రత్తిపాటి పుల్లారావు మిమ్మల్ని ఏదో డబ్బులు డిమాండ్ చేశారని నిందారోపణలు చేస్తున్నావు, దమ్ము ఉంటే ఎక్కడ మిమ్మల్ని డబ్బులు అడిగారో నిరూపించాలని,అలా నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని, నిరూపించలేకపోతే, నువ్వు ప్రత్తిపాటి పుల్లారావు గారికి బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని నేతలు సవాల్ విసిరారు. మీరే నాణ్యమైన వస్తువులు సరఫరా చేసి ఉంటే ఇంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చ ఆంధ్ర మిషన్ పేరిట చేసిన పనులలో ఎంత అవినీతి చేసావో అన్నీ ఆధారాలు ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెట్టనున్నామని నేతలు తెలిపారు. ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి గా నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన పనులు మీద న్యాయ విచారణ చేయించుకుని, నీ నిజాయితీ నిరూపించుకోవాలని, అంతే గానీ అవినీతి కార్యక్రమాలు చేసి, మతాన్ని అడ్డు పెట్టుకుంటే చూస్తూ సహించబోమని నేతలు తెలియజేసారు. మైనారిటీలను ప్రత్తిపాటి పుల్లారావు తన గుండెల్లో పెట్టుకుని ఆదరించాడని, దానికి నిలువెత్తు సాక్ష్యాలు గా నేడు మార్కెట్ యార్డు చెర్మన్, మున్సిపల్ చైర్మన్ , పార్టీ అధ్యక్షులు వంటి ప్రతిష్టాత్మక పదవులు నిర్వహిస్తున్న మేమే ఉదాహరణ అని షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, పఠాన్ సమద్ ఖాన్ లు తెలియజేశారు
