టీటీడీకి మాజీ రైల్వే ఉద్యోగి రూ.10 లక్షలు విరాళం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్, మాజీ రైల్వే ఉద్యోగి కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు సోమవారం గిరిధర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్ ను అందజేశారు.
