లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అవుటి శరణప్ప,ఎంఏ వాజీద్, గోగ్గుల పార్వతి,కొండవీటి వెంకటేశ్వర్ రావు, పింకి వనం గతంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయానిధి కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి తన నివాసం వద్ద 2 లక్షల రూపాయల సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు..
అనంతరం అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద ప్రజలు సిఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
సిఎంఆర్ఆఫ్ ఆర్థిక సహాయం పేదలకు కొండంత భరోసాగా మారిందాన్నారు..
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా బడుగు,బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని కొనియాడారు..
ప్రజాపాలనలో పేద,మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా కార్పొరేట్ రంగంలో వైద్యం అందించడంతో పాటు వైద్యనికి అయినా ఖర్చులు సిఎంఆర్ఆఫ్ ద్వారా పేదలకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు..
సిఎంఆర్ఆఫ్ చెక్కులు అందుకునే ప్రతి లబ్దిదారుని చిరరునవ్వుతో చిరకాల జ్ఞానుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిలుస్తారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
