నూతన కార్యవర్గాన్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్- కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

సాక్షిత న్యూస్, నవంబర్ 16, కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గాజులరామారం డివిజన్ ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్, కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్వైజర్ పి . అంజన్ గౌడ్, అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు మిర్జా అజ్మాత్ బైగ్, వీరేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ రజాక్, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ గౌడ్, షబ్బీరుద్దీన్, శ్రీనివాస్ గుప్తా, సయ్యద్ బారి, ట్రేసరర్ శ్రీనివాస్ గౌడ్, సల్మాన్, ఆర్గనైసింగ్ సెక్రెటరీస్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top