మైనారిటీ, కేజీబీవీ విద్యాలయాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి జిల్లా
భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లను పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మరియు బిఆర్ఎస్వి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఇతర సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో పరిశుభ్రత లోపం మరియు లైటింగ్, కలర్, బిల్డింగ్ క్రాక్స్ వంటివి అత్యవసరంగా మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఉన్నది అని తెలిపారు.
అదే విదంగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలు సరియైన బాత్రూం, క్లాస్ రూమ్ లల్లో ఫ్యాన్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని మరియు విద్యార్థినిలు చదువుకోవడానికి ఒక్క రీడింగ్ హల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరారు.
అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో కూడా మాట్లాడి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కృషి చేయాలని కోరారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.
అదే విదంగా వర్షాకాలం సందర్భంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున దోమల మందు స్ప్రై చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈరోజు సందర్భంగా తెలిపారు.


