UGD నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ 2 కాలనీ లోని నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ సహకారంతో డివిజన్ లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పోశెట్టిగౌడ్, నాగేష్ గౌడ్, అభిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
