బోధ నేతర పనులు బహిష్కరిస్తున్నట్లుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఎంఈఓ కి మెమొరాండం
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్( FAPTO) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడో తేదీన జరిగిన ధర్నా శిబిరంలో తీర్మానించిన మేరకు మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారికి జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కి ఉపాధ్యాయులను బోధనేతరపనుల ను బహిష్కరిస్తున్నట్లుగా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి వీవీఎస్ చంద్రకళ కి మెమోరాండం ఇవ్వటం జరిగింది ఉపాధ్యాయులను బోధన కే పరిమితం చేయాలని,అన్ని రకాల యాప్ లను రద్దు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, మూల్యాంకన పుస్తకాలు రద్దు చేయాలని, గూగుల్ షీట్స్ నింపడం, విద్యా శక్తి. జి ఎస్టీ. సీజనల్ ప్రచారాలు చేయమని బోధనేతర పనులను ఉపాధ్యాయులపై రుద్దటం అన్యాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల బలోపేతం విద్యారంగ పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని కోరారురాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లానా జయప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి వీ రమణ నాయక్ అనిల్ ఎస్టియు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
