బస్తి బాటలో విద్యుత్ సమస్యల పరిశీలన – అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రానా ప్రతాప్ నగర్, కేఎస్ నగర్, ఆర్ కె సొసైటీ ప్రాంతాలలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , TGSPDCL DE శ్యామ్‌కుమార్, AE రాకేష్ గౌడ్, మరియు వారి సిబ్బందితో కలిసి బస్తి బాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా స్థానిక ప్రజలతో కార్పొరేటర్ విద్యుత్ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ముఖ్యంగా LT లూస్ లైన్స్ సరిదిద్దడం, విరిగిన పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్‌లను షిఫ్టింగ్ చేయడం, ఇండ్లపైగా వెళ్ళే విద్యుత్ లైన్లను మార్చడం వంటి సమస్యలపై దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్, కోఆర్డినేటర్ వీరరెడ్డి, షేక్ సుభాన్, అబ్దుల్ రజాక్, మాధవ చారి, వెంకటేష్, శివ, యోగి రాజు, చాంద్ మియా, బాలరాజ్, లింగం, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
