ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఎల్వోసీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బిఆర్ఎస్ నాయకులు…

Sakshitha news

ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఎల్వోసీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బిఆర్ఎస్ నాయకులు…

చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ నెహ్రు నగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ ఖాన్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి కి చెందిన పి. శంకర్ ల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇక్బాల్ ఖాన్ కు (1,25,000/- రూపాయలు), పి.శంకర్ కు (2,50,000/- రూపాయలు) విలువ గల ఎల్వోసీ చెక్కులను మంజూరు చేయించగా ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక నేతలు లబ్ధిదారులకు ఎల్ ఓ సి చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డివిజన్ నాయకులు కార్తీక్ గౌడ్, షకీల్, బాలు నేత, తేజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top