జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా నియోజకవర్గంలోని ఎర్రగడ్డ, హైమావతి నగర్, శాస్త్రి నగర్, అమీర్ పేట్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ .
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల దిశగా ముందుకు సాగుతోంది, అని తెలిపారు.
జూబ్లీహిల్స్ ప్రజలు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న ఈ సమయంలో నవీన్ యాదవ్ గెలవడం అత్యంత అవసరం. ఆయన విజయం అంటే ప్రజల విజయం, అని అన్నారు..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ ప్రేమ్ కుమార్,జితేందర్,సంగీత శ్రీనివాస్ యాదవ్.భాస్కర్ రెడ్డి, దూలపల్లి నరేందర్ రాజు పటేల్,కపిల్,కుమార్ గౌడ్, వెంకటేష్ రెడ్డి,మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
