రైల్వే సాధన సమితి నూతన కమిటీ ఎన్నిక

Sakshitha news

రైల్వే సాధన సమితి నూతన కమిటీ ఎన్నిక..


కోదాడ, సాక్షిత : సూర్యాపేట జిల్లా రైల్వే సాధన సమితి నూతన కమిటీని ఆదివారం కోదాడలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సమితి గౌరవాధ్యక్షుడిగా పందిరి నాగిరెడ్డి, కన్వీనర్‌గా గవిని ఆంజనేయులు, కో-కన్వీనర్లుగా గాదరి మధు, మొగిలి చర్ల అంజయ్యలను ఎన్నుకున్నారు.అదేవిధంగా కన్వీనింగ్ కమిటీ సభ్యులుగా వాస పల్లయ్య, ఎస్.డి. హుస్సేన్, చెవుల నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ,హైదరాబాద్–సూర్యాపేట రైల్వే మార్గం, బుల్లెట్ రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, మేధావులు, యువత, వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని రైల్వే సాధన కోసం ఐక్యంగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Scroll to Top