మజ్జిగ తాగండి… ఆరోగ్యంగా ఉండండి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …
సాక్షిత :130 – సుభాష్ నగర్ జీడిమెట్ల బస్ డిపో వద్ద బిఆర్ఎస్ నాయకులు కోలా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేయడం అనేది మాధవ సేవతో సమానమని అన్నారు. మజ్జిగ తాగి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు డాక్టర్ హుస్సేన్, గుబ్బల లక్ష్మీ నారాయణ, కట్ట సుందర్ బాబు, కట్ట సుకుమార్, ప్రేమ్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

