హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ లో మంజీర నీలల్లో డ్రైనేజ్ కలిసి వస్తుందని కాలనీ వాసుల ఇబ్బంది పడుతున్నారని సమాచారం మేరకు, జలమండలి సిబ్బందితో కలసి పరిశీలించి, పనులను వెంటనే మొదలుపెట్టి సమస్య పరిష్కరించాలని చెప్పేన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, మంజీర నీలల్లో డ్రైనేజ్ కలిసి వస్తుందని, కాలనీ వాసుల ఇబ్బంది పడుతున్నారని సమాచారం మేరకు, జలమండలి సిబ్బందితో కలసి, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులను తీసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది అని, ఎమ్మెల్యే సహకారంతో కొత్త లైన్ వేయడానికి అంచనాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది,
అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని మాజి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి DGM శ్రీనివాస రాజు , మేనేజర్ విలియమ్స్ ప్రకాష్, డ్రైనేజ్ సూపర్వైజర్ నరేంద్ర, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY