గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇంటింట ముమ్మర ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థిగా రమాదేవి శ్రీనివాస్.
మార్పు కోసం నూతన టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా-
గ్రామంలో విద్యా, వైద్య, ఆర్థిక అభివృద్ధికి కృషి-
కోదాడ, : (సాక్షిత చిలుకూరు ప్రతినిధి)
కోదాడ నియోజకవర్గ చిలుకూరు మండల పరిధిలోని దూదియా తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి లావూరి రమాదేవి శ్రీనివాస్ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను ఎన్నుకోవాలని ఆమె గడపగడపకు అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దూదియా తండ గ్రామంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించడమే నా లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రతి ఇంటిలో అక్షరం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి దిశగా పనిచేసే మీ అందరి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో నెలకొని ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మీ పిల్లలకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామములో ఉన్న కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన వాతావరణం కోసం కృషి చేస్తానని ఆరోగ్యం లేని అభివృద్ధి వ్యర్ధమని గ్రామాభివృద్ధికి హార్దిక వనరులు సమకూర్చుకొని గ్రామాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
గ్రామంలో నెలకొని ఉన్న కాల్వకట్ల పునర్ధరణ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సొంత ఖర్చులతో గ్రామములో గ్రంధాలయ ఏర్పాటు, గ్రామములో నిరుపేద కుటుంబాల పిల్లలు కళ్యాణం చేసుకున్న వారికి పసుపు కుంకుమ, పట్టువస్త్రాలు అందజేస్తాను. గ్రామంలో ఎవరైనా మరణిస్తే దగ్గరుండి వారి ఇంటి పెద్ద దిక్కుగా అంత్యక్రియలు నిర్వహిస్తానని, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ, గ్రామ సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టినాటి నుండి నా హయాంలో నిరుపేద స్త్రీ భర్త మరణించిన మహిళలకు సహకార సంఘం పథకాలను అందించేందుకు కృషి చేస్తాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భానోత్ కృష్ణ చైతన్య, మాజీ సర్పంచ్ బానోత్ నందులాల్, బానోత్ వాసు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, లావణ్య రాంభాస్కర్, భూక్య లైలా, మరియు నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
