డబల్ బెడ్ రూమ్ బాధితులకు న్యాయం చేయించండి.
సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తానని చెప్పి ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన శ్రీధర్ ముదిరాజ్ వద్ద నుండి మోసపోయిన బాధితులకు న్యాయం చేయించాలని నేడు సిపిఐ నాయకులు జీడిమెట్ల గడ్డం మల్లేష్ గారికి బాధితులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వ హాయంలో కొంతమంది ప్రభుత్వ మరియు ప్రజాప్రతినిధుల సంబంధాలను చూపి డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తానని చెప్పి అమాయక ప్రజల వద్ద నుండి లక్షల రూపాయలను వసూలు చేయడం నేడు అది నకిలీగా తెలియడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున ఈ వ్యవహారం వెనకాల ఉన్న వారందరినీ పట్టుకొని చట్ట ప్రకారం మోసపోయిన బాధితులకు సహాయం చేయాలని, వారికి సాయం అందింతవరకు సిపిఐ మద్దతుగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా సిఐ గడ్డం మల్లేష్ గారు మాట్లాడుతూ బాధితులకు చట్ట ప్రకారంగా న్యాయం జరిగేలా చూస్తానని, ఇంకెవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యేసు రత్నం, సిపిఐ మండల కార్యదర్శి కే స్వామి, ఏఐటీయూసీ అధ్యక్షులు హరినాథ్ రావు, సిపిఐ నాయకులు మధు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
