మొంథా తుఫాన్ కారణంగా కురస్తున్నా భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ:……..
రావుల గిరిధర్,.,
- వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లవద్దు..చిన్న తప్పిదం పెద్ద ప్రమాదంగా మారొచ్చు
- అనవసరంగా రోడ్లపైకి రాకండి, అత్యవసర పరిస్థితుల్లో 100కి కాల్ చేయండి
- వర్షాలతో కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించడంలో పోలీసులు సిద్ధం
- చేపల వేట, వరద నీటిలో ఆటలపై కఠిన నిషేధం ప్రజల ప్రాణ భద్రతే ప్రథమం
సాక్షిత వనపర్తి :
జిల్లాలో మొంథా తుఫాన్ దృష్ట్యా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్, కోరారు
బుధవారం జిల్లా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ. మెంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని, చేపల వేట లేదా నీటిలో ఆటల వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. వర్షా ప్రభావంతో రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని సూచించారు.
వాగులు చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిన క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను వాగులు చెరువులు కుంటలను తిలకించేందుకు ఎవరు వెళ్లవద్దని సూచించారు.
రైతులు తమ పశువులను, వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, పిల్లలు, వృద్ధులు నీటి ముంపు ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100, వనపర్తి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 6303923200 కు సమాచారం అందించాలని తక్షణ సహాయక రక్షణ చర్యలకు వర్షాల సమయంలో ప్రజల రక్షణ కోసం జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
“ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. జీవన రక్షణకే ప్రాధాన్యత ఇవ్వండి, రిస్క్ తీసుకోవద్దు,” అని జిల్లాప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు .

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
