జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి దసరా శరన్నవరాత్రులు రెండో రోజు మోడల్ గెస్ట్ హౌస్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) నుంచి పరిస్థితిని సమీక్షించారు. సీసీటీవీ దృశ్యాలను వీక్షించిన అనంతరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
