డ్వాక్రా మహిళలకు కోడిపిల్లలు పంపిణీ
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించి కోడి పిల్లలను అందించారు. మండలంలోని మహిళా సంఘాలలో 70 యూనిట్లకు కోడి పిల్లలను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రతి మహిళ ఉద్యోగ , ఉపాధి అవకాశాలతో పాటు వారికి చేయుతనందించి ఆర్థికంగా ఎదగాలన్నదే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
