ప్రధాని మోడీ మెడలు వంచిన రాహుల్ గాంధీ.
రాహుల్ దెబ్బకు ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.
ఇది విద్యార్థుల విజయం.
—రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ..
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్రం మెడలు వంచి విద్యార్థుల అభీష్టాన్ని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లకు దక్కుతుందని ఎర్రబెల్లి స్వర్ణ చెప్పారు.
28 రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా చీమ కుట్టినట్టైనా లేని ప్రధాని మోడీకి, విద్యార్థులకు కాంగ్రేస్ పార్టీ మద్దతు పలికి దేశవ్యాప్తంగా ఉద్యమించటంతో దిగిరాక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని, రాబోయే రోజుల్లో ప్రధాని మోడీని గద్దెదించటమే తమ కర్తవ్యమని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
నిరసనల్లో మృతి చెందిన విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారికి తగిన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
