భక్తుల సౌకర్యాలే లక్ష్యం.. ఆలయ పనుల్లో జాప్యానికి తావులేదు….

Sakshitha news

భక్తుల సౌకర్యాలే లక్ష్యం.. ఆలయ పనుల్లో జాప్యానికి తావులేదు….

–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్..

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి’ హైదరాబాద్/ : రామగుండం నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు.

ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పనులు పూర్తి చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు.

ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఆలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ఎండీ ముస్తాఫా, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top