మైనార్టీ సమాజానికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలనీ డిమాండ్

Sakshitha news

మైనార్టీ సమాజానికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలనీ డిమాండ్

బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్

అధికారులు స్పందించి
పాఠశాల గుర్తింపును రద్దుచేయాలి
….

సాక్షితవనపర్తి :
ఎన్నికలకు ముందు పండుగల సమయంలో వస్త్రాదరణలు ధరించి పాల్గొని మైనార్టీలకు మైనార్టీ సెల్ పదవులను ఇస్తామని అన్ని విధాలుగా ఆదుకుంటామని కల్లబొల్లి వా గ్దానాలు మోసపూరిత మాటలు చెప్పి మైనార్టీల ఓట్లను దండుకొని ఎమ్మెల్యేగా గెలుపొందిన మెగా రెడ్డి

మైనార్టీ మైనర్ బాలికపై జరిగిన ఘటనలో నిజా నిజాలు ఏమిటో తెలియకుండానే బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండానే స్కూల్ యాజమాన్యాన్ని, నిందితున్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా అన్యాయాన్ని ప్రశ్నించిన మైనార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం చూస్తే ఎమ్మెల్యే కు మైనార్టీలపై ఉన్న ప్రేమ ఏమిటో అర్థం అవుతుందని మైనార్టీ సోదరులు కళ్ళు తెరిచి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ మైనార్టీ సమాజాలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేస్తూ మైనార్టీల పట్ల ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే 90 రోజుల్లోనిందితులకు శిక్షపడేలా చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అఖిలపక్షం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు యాదవ్ పుట్ట ఆంజనేయులు పలుస రమేష్ గౌడ్ షేక్ జాంగిర్ హేమంత్ ముదిరాజ్ లు డిమాండ్ చేశారు

విద్యార్థినిపై జరిగిన సంఘటనను ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకునేది కాదని దాచిపెట్టిన విషయాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకుల పై జిల్లాపోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలగా అతి ఉత్సాన్ని ప్రదర్శిస్తూ అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమని జిల్లా కలెక్టర్ విద్యాధికారులు స్పందించి పాఠశాలకు సంబంధించిన అన్ని అనుమతులు రద్దు చేయాలని లేకుంటే దశలవారీగా ఉద్యమం చేపడతామనే చదివించారు కార్యక్రమంలో కౌన్సిలర్ మదన్ జోహార్ హుస్సేన్ ఇమ్రాన్ అస్లాం జమీల్ సిపిఎం నాయకులు పరమేశ్వర్ చారి కురుమయ్య బాలస్వామి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top