దసరా సెలవల్లో సైతం ప్రైవేటు టీచర్లకు తప్పని పనిభారం

Sakshitha news

దసరా సెలవల్లో సైతం ప్రైవేటు టీచర్లకు తప్పని పనిభారం

పట్టించుకోని సంబంధిత అధికారులు

ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం

తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టి.పి.యస్.యూ జిల్లా నాయకులు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిది : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 21 నుండి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ సూర్యాపేట జిల్లాలో పలు ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు పిల్లలకు జూమ్ క్లాసుల పేరిట ప్రైవేట్ టీచర్లను పాఠశాలలకు రావాలని వత్తిడి చేస్తున్నారని మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోగల స్థానిక 60 ఫీట్ రోడ్డులోని జయ పాఠశాలముందు తెలంగాణ ప్రైవైట్ ఉపాధ్యాయ సంఘం నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా టి.పి.యు.ఎస్ జిల్లా అద్యక్షలు బచ్చలకూరి జానయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ జీవోలతో ఎటువంటి పట్టింపు లేనట్టుగా సూర్యాపేట లోని జయ, శ్రీచైతన్య ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరించడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో వర్క్ షాపుల పేరిట ప్రైవేటు టీచర్లను పాఠశాలల యాజమాన్యం ఇబ్బందులకు , మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. దసరా సెలవల్లో ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పిల్లలు వారి కుటుంబాలతో సంతోషంగా గడపవలసిన సమయంలో వర్క్ షాపులు , తదితర క్లాసుల పేరిట ప్రైవేటు ఉపాధ్యాయులతో వెట్టి చాకిరి చేపిస్తున్నారని ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి సెలవుల్లో సైతం ప్రైవేటు టీచర్లతో పనులు చేపిస్తున్న పాఠశాలలను గుర్తించి వారి పాఠశాలల పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు పిల్లలమర్రి కళింగం, ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యాక్షలు భోమ్మకంటి ఉపెందర్,గైగోళ్ళు మహేష్,సహయ కార్యదర్శి కట్టంకూర్ లక్ష్మణ్,సంయుక్త కార్యదర్శి డికొండ ఉషారాణి,కాశాధికారి బోడ్డు బాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు రాపర్తి నాగరాజు, వెదాసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.