అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని :. రైజింగ్ రామగుండం గా పేరు తీసుకువచ్చేoదుకు మేము సైతం అంటూ, ప్రతి ఒక పౌరుడు కదలి రావాలని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగoగా 9వ డివిజన్ లో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి బుధవారం వార్డు సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం నగరాన్ని ఒక స్వచ్ఛమైన అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు.
నగరంలోని నాలాల పూడిక తీత ఒక దశాబ్ద కాలంగా చేపట్టడం జరగలేదని అన్నారు. ప్రస్తుతం రామగుండం నగర పాలక సంస్థకు సమర్ధత ,అనుభవం కలిగిన పాలక వర్గం ఏర్పడిన క్రమంలో శానిటేషన్ తో పాటు అన్ని సమస్యలు తీరిపోతాయని అన్నారు.
వర్షాకాలంలో వరద ముప్పు తో పాటు దుర్గంధం నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులు నివారించడానికి పూర్తి స్థాయిలో కాంక్రీట్ కాలువ నిర్మాణం త్వరలో చేపడతామని అన్నారు. ఊరంటే రామగుండంలా ఉండాలి అనే విధంగా ఈ నగరాన్ని రూపుదిద్దుకుందామని అన్నారు.
రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ కాలువ లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మునిసిపల్ సిబ్బందికి చెత్త ఇవ్వాలని, వర్షాకాలం లోపు నగరంలోని అన్ని నాళాల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని అన్నారు.
ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈ సందర్బంగా వినోభా నగర్,రెల్లి వాడ లో ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలో యంత్రాలు, సిబ్బంది సహాయంతో పూడిక తొలగించి సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే మేయర్ అధికారులకు ,సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభించి గల్లీ గల్లీలో తిరుగుతూ మునిసిపల్ సిబ్బందికి సూచనలు ఇస్తూ పిచ్చి చెట్లు, కొమ్మలు, పొదలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ తాళ్లపెళ్లి యుగంధర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు,నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకట స్వామి, ఇ ఇ పి వి రామన్, టి పి ఎస్ నవీన్ , ఎ ఇ జమీల్ , సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగ భూషణం, సూపర్ వైజర్ రవి కుమార్ , ఎలక్ట్రికల్ ఎ. ఇ. రాంజీ , వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY