18న జరిగే బీసీ సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు : సిపిఐ మద్దతు

Sakshitha news

18న జరిగే బీసీ సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు : సిపిఐ మద్దతు

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనలో బిజెపి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుండడంతో బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల సాధనకు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాల జెఎసి అక్టోబర్‌ 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్‌కు సిపిఐ పార్టీ అశ్వారావుపేట మండల సమితి నుండి పూర్తి సహకారం అందిస్తామని సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.