తమిళ గాంధీ నల్లకన్ను మరణం తీరనిలోటు.
సిపిఐ నాయకుల నివాళులు.
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, 101 సంవత్సరాలు జీవించిన తమిళ గాంధీ నల్ల కన్ను మరణించడం తమిళ ప్రజలకే కాకుండా దేశంలోని అట్టడుగు వర్గాల వారికి తీరనిలోటని వారి మృతికి జోహార్లు అర్పిస్తూ సిపిఐ కుత్బుల్లాపూర్ మండల ఆధ్వర్యంలో షాపూర్ నగర్ కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సమావేశానికి మండలం కార్యదర్శి కె స్వామి అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న తమిళనాడులో నిరుపేద కుటుంబంలో జన్మించి అనేక అవమానాలకు గురై తన 17వ ఎటలో సిపిఐ సభ్యత్వాన్ని తీసుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని సుమారు 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి విడుదలై ప్రజల కోసమే నిత్యం పోరాటం చేశారని దానికి గుర్తింపుగా తమిళనాడులో ప్రజలు వారిని తమిళ గాంధీ గా పిలుచుకుంటారని అన్నారు. అంతేకాకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ నల్ల కన్ను ని ఎంతో గౌరవించేవారు అని, ముఖ్యంగా కరుణానిధి నల్ల కన్నును తన కన్నుగా అభివర్ణించారని, అదేవిధంగా స్టాలిన్ నల్లకన్ను ని ముఖ్యమంత్రి అయ్యాక ఆశీర్వాదం తీసుకున్నారని ఇలా తమిళ ప్రజలు మొత్తం నల్ల కన్ను ని ఒక గొప్ప నాయకుడిగా భావించే వారిని కానీ వారు నేడు అనారోగ్య కారణాలతో చనిపోవడం తమిళ ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలకు తీరని లోటని అన్నారు.
జీవించి ఉన్నప్పుడే కాకుండా మరణించాక కూడా వారి మృతదేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కి రాసి ఇచ్చి మరణాంతరం కూడా ప్రజల కోసమే జీవించిన వ్యక్తి అని కొనియాడారు.అలాంటి వారు నడిచిన మార్గంలో సిపిఐ కార్యకర్తలు నడిచి వారు కలలు కన్నా సమ సమాజం కొరకు పాటుపడాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలిలు ఘటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మండల కార్యదర్శి కే స్వామి సహాయ కార్యదర్శులు వి హరినాథ్ రావు, డి రాములు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, యువజన సమైక్య అధ్యక్షులు సంతోష్, సిపిఐ మండల నాయకులు నరసింహ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, భీమేష్, గుర్రప్ప తదితరులు పాల్గొనడం జరిగింది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
