కాంగ్రెస్తోనే అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం ప్రచారంలో సిపిఐ
సాక్షిత వనపర్తి : వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణ వార్డుల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సిపిఐ ఎన్నికల పొత్తులో భాగంగా 19, 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్తో కలిసి సిపిఐ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. తాజాగా వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో అవగాహన కుదిరింది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారన్నారు. మున్సిపల్ లో అధికారంలోకి తెస్తే రోడ్డు డ్రైన్లు పారిశుధ్యం వివిధ అభివృద్ధి పనులు జరుగుతాయి అన్నారు.
రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి ప్రజలకు వసతులు సమకూరుస్తారన్నారు. వనపర్తి మున్సిపల్ వార్డుల్లో సమస్యల పరిష్కారం బాధ్యత సిపిఐ తీసుకుంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఐ వాటి పరిష్కరించడంలో కూడా ముందుంటుందన్నారు. సిపిఐని నమ్మి వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 19 వ వార్డు అభ్యర్థి ఎల్ఐసి కృష్ణ 20వ వార్డు అభ్యర్థి పాకనాటి కృష్ణయ్య, సదుర్ల రమేష్, సిపిఐ నాయకులు ఎర్రకురవన్న, పృధ్వి నాదం, గోపాలకృష్ణ, నరేష్, వంశీ, మాజీ కౌన్సిలర్ చంద్రకళ, గోపాల్, కొమ్ముల అంజి, గోకం భాగ్యమ్మ, యశోద, మన్నెమ్మ, సత్యమ్మ,అంజనమ్మ వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

