కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ టీయూడబ్ల్యూజే హెచ్–143 నూతన కార్యవర్గం
కుత్బుల్లాపూర్ టీయూడబ్ల్యూజే హెచ్–143 నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని బాచుపల్లిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సుధీర్ మంకాల, కుత్బుల్లాపూర్ టీయూడబ్ల్యూజే హెచ్–143 నూతన కమిటీ అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, అధ్యక్షులు సుగ్రీవుడు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నాలేటి మాధవరెడ్డి, కోశాధికారి ఎర్రోళ్ల బాబు, ఉపాధ్యక్షులు బాన్సువాడ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు పి. శివ, పాండురంగం, ప్రసాద్ గుప్తా, కె. ప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
అనంతరం ప్రజాజ్వాల తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను స్థానిక జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు.

