రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Sakshitha news

మాజీ ప్రధాని స్వర్గీయ కి.శే శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

మాజీ ప్రధాని స్వర్గీయ కీ.శే శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, రాజ్యలక్ష్మి, సౌందర్య, అరుణ, మంజుల, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.