జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ సందర్భంగా *కార్పొరేటర్

Sakshitha news

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ సందర్భంగా *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ * ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బి.ఆర్‌.ఎస్‌ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి మహత్తరమైన పథకాల ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధిపొందాయని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు పూర్తి చేసిన దాఖలు లేవని, కల్యాణ లక్ష్మి 1 లక్ష 116 రూపాయల తో పటు తులం బంగారం ఇస్తామని, మహిళలకు 2500 ఇస్తామని, ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, వికలాంగులకు పెన్షన్ 2000 పెంచుతామని 22 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చింది లేదని, 110 రోజుల్లో ఇస్తామన్న గారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగించడానికి మరియు అభివృద్ధి దిశగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ బి.ఆర్‌.ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో నాగుల సత్యం, మల్తుంకర్ మహేందర్, గౌస్, ఉమర్, చిట్ల రవీందర్ రెడ్డి, షేక్ రఫీక్, సంజీవరెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్, ఖాసీమ్ ఖాన్, నరేష్, అక్బర్ ఖాన్, మున్నా, యూనుస్, మౌనిక, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top