ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు: డాక్టర్ మెతుకు ఆనంద్.
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటింటికి BRS కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ లోని 19 వ వార్డు రామయ్యగూడ లో ఉదయం 08:00 గంటల నుండి ఇంటింటికి తిరుగుతూ.. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను అందరిని కలుస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
KCR పాలనలో పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలకు నిధులు విడుదల చేసి, ట్రాక్టర్లు కొనుగోలు, హరితహారం కింద మొక్కలు నాటడం, ఇంటింటికీ చెత్త సేకరణ, వీధులు, మురికి కాల్వలను శుభ్రం చేయడం, పాత ఇండ్ల శిథిలాలను తొలగించడం, ఖాళీ ప్రదేశాలు శుభ్రం చేయడం, పాత, పనిచేయని బోర్లను మూసివేయడం, నీరు నిల్వ ఉండే గుంతలను పూడ్చివేయడం, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రంచేయడం, మార్కెట్లు, సంతలు నిర్వహించే ప్రదేశాలను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టేవారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరం నడుస్తున్న సరే వికారాబాద్ పట్టణాన్ని గాలికి వదిలేసింది.
నిధులు లేక పట్టణాలు విలవిలాడుతున్నాయి.
డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త వల్ల కొన్ని చోట్ల రోజుల తరబడి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది.
చెత్తను తొలగించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి… పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారిపోయాయి.
కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అంతా శూన్యం. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నడవక పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహిళలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రజలు నీలాదీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని గొప్పలకు పోయిన రేవంత్ రెడ్డి.. KCR హయాంలో ప్రారంభమై, సమర్థవంతంగా సాగిన సంక్షేమ పథకాలను కూడా నిలిపివేశారు.
మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.2,500 హామీ ఏమైంది?
వృద్ధులకు ఇస్తామన్నా రూపాయలు 4000 పెన్షన్ ఎగ్గొట్టారు.
ఇలా చెప్తూ పోతే కాంగ్రెస్ చేస్తున్నవన్ని మోసాలే…
BRS ప్రభుత్వ హాయంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాల అమలు చేసిన ఘనత KCR ది.
వికారాబాద్ పట్టణ ప్రజలు ఒకసారి గమనించండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాం.
ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అధికారం లోకివచ్చి 3 సంవత్సరాలు నడుస్తున్న ఏ ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో లేరు.
ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు.
ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ప్రభుత్వంపైన ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి ఎన్నికల్లో BRS పార్టీ మంచి విజయం నమోదు చేయాలని నాయకులకు సూచించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణంలో BRS జెండా ఎగురుతుంది అనే ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.

