మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు బాధితులైన కుటుంబాలతో కలిసి ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి . మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి .
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగోల్‌లో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) మరియు నాగోల్‌లో అభివృద్ధి చేసిన మూసీని పరిశీలించి పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో,ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి . మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి .
అనంతరం మీడియాతో మాట్లాడుతారు.
కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఒక విజన్‌తో ముందుకు సాగింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఆధునిక రహదారులు, ఫ్లైఓవర్లు, స్టార్టప్ ఎకోసిస్టమ్, అంతర్జాతీయ పెట్టుబడులు—ఇవి నగరాన్ని గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టాయి. నగరానికి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, యువతకు అవకాశాలు పెరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదు. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారు.
మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ. 3800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించింది.
మరోవైపు మూసీలో ఇళ్లు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తమ సొంత మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలు, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నాడని, అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మూసీ బాధితుల కోసం భారత రాష్ట్ర సమితి అన్ని రకాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. వీరికి సంబంధించిన న్యాయపోరాటంలోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇళ్లను కూల్చడం ఆపేయాలని, తమ ఎమ్మెల్యేలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, ఇళ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసే ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

