SAKSHITHA NEWS

ఐకమత్యంతో ఉన్నపుడే కాలనీ అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ….
సాక్షిత : దుందిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ “లహరి గ్రీన్ పార్క్ అసోషియేషన్” ఆధ్వర్యంలో వృక్షో రక్షతి రక్షితః అనే థీమ్ తో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ , ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ , కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ కాలనీ అభివృధ్ధిలో ప్రజా ప్రతినిధులతో పాటు కాలనీ వాసులంతా ఐకమత్యంగా పనిచేస్తే కాలనీ వేగవంతంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కాలనీ అభివృద్ధి కోసం కావలసిన నిధులను వెచ్చించి కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సిసి రోడ్లు, విధి దీపాల వంటి వాటికి కృషిచేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ప్రదీప్ రావ్, భౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లహరి గ్రీన్ పార్క్ అధ్యక్షులు శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు సిహెచ్.విష్ణు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెసరర్ రవీందర్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS