ఆరోగ్య, ఆర్ధిక భద్రతకై అర్హులైన ప్రతీఒక్కరూ సీఎంఆర్ఎఫ్ ను వినియోగం చేసుకోవాలి….
సాక్షిత : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుడికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన లబ్దిదారులకు అందజేశారు.
ఎల్వోసీ పత్రాల అందజేతలో భాగంగా సిఎంసీ 129 – సూరారం డివిజన్ నెహ్రు నగర్ కి చెందిన కొండవీటి అన్నమ్మ భర్త కె. మంతెనయ్య రూ.75,000/- (డెబ్భై ఐదు వేల రూపాయలు) మంజూరు కాగా, 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన నూకారపు సూర్యనారాయణ తండ్రి ఎన్. రామి నాయుడు కు రూ.1,50,000/- (ఒక లక్ష యాభై వేల రూపాయలు) మంజూరు కాగా ఆయా డివిజన్లకు చెందిన నాయకులు లబ్దిదారుల కుటుంబసభ్యులకు ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్య నారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, నాయకులు బలరాం రెడ్డి, గుబ్బల లక్ష్మీనారాయణ, ప్రభుదాస్, దుర్గారావు, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, లక్ష్మణ్, రాజు, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
