సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట సంజీవిని – ఎమ్మెల్యే కే.పి.వివేకానంద

Sakshitha news

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట సంజీవిని – ఎమ్మెల్యే కే.పి.వివేకానంద..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 129 సూరారం డివిజన్ నెహ్రూ నగర కు చెందిన మహమ్మద్ ఉజైర్ కి రూ.2లక్షలు మరియు సంజయ్ గాంధీ నగర్ కు చెందిన మహేష్ కుమార్ పట్నాయక్ కు రూ. 1 లక్ష విలువగల LOC చెక్కులను ఎమ్మెల్యే కె.పి.వివేకానంద చొరవతో CMRF నిధుల ద్వారా మంజూరు చేయించి స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ లబ్ధిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయనిధి ఆపత్కాలంలో అండగా నిలిచి, అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సిద్ధికి, ప్రభుదాస్, రవి పాల్గొన్నారు.